మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ శివారులో ట్రాక్‌కు రంగులు వేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందారు. ఉదయం 6 గంటలకే విధుల్లో చేరిన పాషా, కమలాకరాచారిలు అప్‌లైన్ మహబూబాబాద్ నుంచి కాజీపేట మార్గంలో ట్రాక్‌పై పనులు చేస్తుండగా... మూల మలుపు 434/0 మైలురాయి వద్ద కమలాకరాచారి, 434 /15 మైలురాయి వద్ద పాషాలను కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. మూలమలుపు వద్ద హారన్ కొట్టకపోవడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు గమనించకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని గుర్తించారు. ట్రాక్‌పై మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి