ETV Bharat / crime

Sexual Harassment: 'ఆ సమయంలో వీడియో తీశారు.. నా భర్తకు చూపిస్తామని... ' - sexual harassment on woman

Sexual harassment in vishaka: ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Sexual Harassment on woman
మహిళపై లైంగిక వేధింపులు
author img

By

Published : Dec 2, 2021, 5:46 PM IST

Sexual harassment in vishaka: ఓ వివాహితను ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించిన ఘటన విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని పద్మనాభం మండలానికి చెందిన ఓ వివాహితపై.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పది రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

sexual harassment on woman: గంటా వీరబాబు, పంది దుర్గాప్రసాద్ (హరిబాబు) అనే ఇద్దరు.. గత నెల 21న బహిర్భూమికి వెళ్లిన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒక వ్యక్తి తనను బలవంతం చేసేందుకు ప్రయత్నించగా.. మరో వ్యక్తి వీడియోలో చిత్రీకరించాడని మహిళ వాపోయింది. ఎలాగోలా వారిని తప్పించుకుని ఇంటికి చేరుకున్నానని తెలిపింది.

అయితే.. అప్పటి నుంచి వారిరువురూ కామ వాంఛ తీర్చాలని పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఆ వీడియోను చూపిస్తానని పదేపదే వేధిస్తుండటంతో జరిగిన విషయాన్ని తన భర్త, అత్తమామలకు తెలియజేసినట్లు వివరించింది. అనంతరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Wife Kidnap: భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. ఎందుకంటే?

Sexual Harassment : స్టేషన్​లోనే వేధింపులు... చివరికి ట్రైనీ మహిళా ఎస్సైకీ తప్పలేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.