ETV Bharat / crime

పంచాయతీ కార్యదర్శుల మరణాలకు కారణమదేనా..! - పంచాయతీ కార్యదర్శులు

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారి మృతికి పని ఒత్తిడే కారణమని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సూర్యాపేట జిల్లాలోనే ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులు మృత్యువాత పడ్డారు.

Two members panchayath secretaries died
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మృతి
author img

By

Published : Jun 4, 2021, 1:30 PM IST

అధిక పని ఒత్తిడితో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చనిపోయారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మరణించారు. జిల్లాలోని అనంతగిరి మండలం పాలరం, వెంకట్రామపురం గ్రామ పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు.

ఒకరు ఆత్మహత్య.. మరొకరికి గుండెపోటు

పాలరం గ్రామ కార్యదర్శి ఆరే హారిశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి పంచాయతీ కార్యదర్శి కొలువు సాధించాడు. చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఒత్తిడికి గురై బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోసటి రోజే వెంకట్రామపురం కార్యదర్శి బానోత్ గణపతి గుండెపోటుతో మృతి చెందారు. పై అధికారుల ఒత్తిడి వల్లే మరణించాడని ఆయన బంధువులు ఆరోపించారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీడీఓ శ్రీనివాసరావును గ్రామస్థులు నిలదీశారు. చిన్న వయసులోనే ఉద్యోగ ఒత్తిడితో ఒకే మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందడం పట్ల తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.