అతి వేగానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. కుమురం భీం జిల్లా గోలేటి ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ.. మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇరు లారీలకు చెందిన డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.
మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్‌కు మొక్కజొన్న లోడుతో వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ వేగంగా వచ్చి.. సిమెంట్ లోడుతో ఎదురుగా వస్తోన్న మరో లారీని ఢీ కొట్టాడు. ఇరు లారీలకు చెందిన డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయి.. ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇదీ చదవండి: యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..!