ETV Bharat / crime

Accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్​ స్పాట్​ డెడ్​ - డ్రైవర్​ స్పాట్​ డెడ్​

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు బాహ్య వలయ రహదారిపై తెల్లవారు జామున ముందు వెళుతున్న ఇటుకల లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ(lorry accident) కొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.

patancheru accident news
lorry accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్​ స్పాట్​ డెడ్​
author img

By

Published : Jun 2, 2021, 3:51 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం(lorry accident) సంభవించింది. అత్తాపూర్​కు చెందిన లారీ ముందు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ బలంగా ఢీ కొట్టింది.

దీంతో తమిళనాడుకు చెందిన లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడం వల్ల… డ్రైవర్ కార్తిక్ రాజు క్యాబిన్​లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే క్యాబిన్​లో ఉన్న క్లీనర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నుజ్జునుజ్జు అయిన లారీ క్యాబిన్ నుంచి క్రేన్ సహాయంతో డ్రైవర్ కార్తిక్ రాజును బయటకు తీసి… శవాగారానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.