children died in Accident: ఊహించని మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పెబ్బేరు మండలం శాగాపురానికి చెందిన శివకుమార్..భార్య, పిల్లలతో కలిసి...తన సోదరి ఊళ్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. ఉదయం వారిని తీసుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కొంతదూరం వచ్చాక పెట్రోల్ అయిపోవటంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
![two kids died in accident at wanaparthy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15096032_car.png)
పిల్లలను వాహనంపై కూర్చోబెట్టిన శివకుమార్... పెట్రోల్‌బంక్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వేగంగా వెళ్తున్న కారు టైరు పగిలిపోయింది. అదుపుతప్పిన కారు... రోడ్డుపక్కన బైక్‌పై కూర్చున్న శివకుమార్ పిల్లలు హిమాన్స్ తేజ, ఆరాధ్యపైకి దూసుకెళ్లింది. గాల్లో ఎగిరిపడ్డ చిన్నారులు.. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. తల్లీమరో చిన్నారి దూరంగా నిలబడి ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. చిన్నారుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్న తీరు.... అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది.
ఇవీ చదవండి: KTR About BJP : 'భాజపాది బలుపు కాదు వాపు'