ETV Bharat / crime

మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే..!

youth fight on road: మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Attack
మద్యం మత్తులో యువకుల హల్‌చల్
author img

By

Published : Feb 25, 2022, 5:23 PM IST

youth fight on road: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. అర్ధరాత్రి నడిరోడ్డుపై హంగామా చేశారు. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌కు కూతవేటు దూరంలోనే ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

గొడవకు కారణమిదే..

కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఇరువర్గాలకు చెందిన యువకులు కొట్టుకున్నారు. మొదట మంకమ్మతోటకు చెందిన కొందరు యువకులు కట్టరాంపూర్‌కు చెందిన యువకులతో గొడవపడి తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలు తిన్న ముగ్గురు కట్టరాంపూర్‌కు నుంచి మరికొందరు మిత్రులను పిలిపించుకుని వారితో మళ్లీ గొడవకు దిగారు. మొదట వారిపై దాడి చేసిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. బస్టాండ్‌లోకి చొరబడి మరీ ఉరికించుకుంటూ ఆ యువకుడిపై దాడి చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్ గేట్ వద్దకు చేరుకుని ఇరువర్గాల యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో యువకులు బీభత్సం సృష్టించడంతో స్థానికంగా కలకలం రేగింది.

మద్యం మత్తులో యువకుల హల్‌చల్.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.