Two groups Fight in Khammam : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అమ్మపాలెంలో వక్ఫ్ భూముల విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. గొడ్డళ్లు, కత్తులు, రాళ్లతో కొట్టుకున్నారు. ఆ భూములు వంశ పారంపర్యంగా తమవేనని ఒక వర్గం వారు.... తాము కొన్నామని మరో వర్గం మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇటీవల ఒక వర్గానికి చెందిన వారు... ఆ భూములను విక్రయించే ప్రయత్నం చేస్తుండగా మరో వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సినీ ఫక్కీలో ఇరు వర్గాలు కత్తులు, గొడ్డళ్లతో కొట్టుకున్నారు.
ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. గొడ్డళ్లు, కత్తులతో దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.