ETV Bharat / crime

ఇరువర్గాల దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు - దాడిలో ఒకరికి తీవ్రగాయాలు

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం యనంపల్లితండాలో ఈ ఘటన జరిగింది.

యనంపల్లితండాలో ఇరు వర్గాల దాడి
two groups attack each other
author img

By

Published : Mar 27, 2021, 3:41 PM IST

Updated : Mar 27, 2021, 3:57 PM IST

పాతకక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం యనంపల్లితండాలో రాత్రి సమయంలో జరిగింది.

ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇదివరకే పాతకక్షలు ఉండటం ఘర్షణకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో రవి అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

​ పరామర్శించనున్న ఎంపీ అర్వింద్​..

ఘర్షణలో గాయపడిన వ్యక్తిని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ పరామర్శించనున్నారు. తెరాస కార్యకర్తలు కావాలనే దాడి చేశారని ఆరోపిస్తూ ఛలో యనంపల్లితండాకు భాజపా శ్రేణులు పిలుపునిచ్చాయి.

ఇదీ చూడండి: చిట్కుల్ గ్రామ శివారులో మహిళ దారుణ హత్య

Last Updated : Mar 27, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.