చెరువు లీజు (pond lease issue) విషయంలో ఇరువర్గాలు(Two groups fight) ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. గ్రామపంచాయతీ ఆవరణలోనే ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా.. గ్రామ పంచాయతీ ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(suryapet) అనంతగిరి మండలం శాంతినగర్‌లో(santhinagar) చోటు చేసుకుంది.
గొడవకు కారణం ఇదే.!
ముప్పై సంవత్సరాలుగా గ్రామానికి చెందిన ఎస్సీలు చెరువులో చేపలు పెంచుకుంటున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం ఈసారి చేపల చెరువు లీజును మరో సామాజిక వర్గానికి ఇచ్చేందుకు నిర్ణయించారు. గ్రామపంచాయతీ నిర్ణయంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఎస్సీలు భావించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గానికి చెందిన వారు చెరువులో చేపలు పోయడంతో ఘర్షణకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
తమను రోడ్డున పడేయొద్దు
30 ఏళ్లుగా తాము చెరువు లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నామని ఎస్సీలు వాపోయారు. లీజు మరొకరికి ఇస్తే తాము జీవనోపాధి కోల్పోతామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కూడా తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి చెరువు లీజు మరొకరికి ఇవ్వాలని మరో వర్గం డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది
ఇదీ చూడండి: రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి.. కల సాకారమయ్యే వేళ ప్రాణం కోల్పోయి