ETV Bharat / crime

Road accident: మృత్యువులోనూ వీడని స్నేహబంధం.. ప్రమాదంలో ఇద్దరు మృతి - ప్రమాదంలో ఇద్దరు మృతి

Road accident: బాల్యం నుంచి వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. అన్నదమ్ముల్లాగా ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవారు. ఊహించని రూపంలో వచ్చిన మృత్యువు వారిద్దరిని కబళించింది. మృత్యువు కూడా వారిద్దరి స్నేహబంధాన్ని విడదీయలేకపోయింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా రామేశ్వర్​పల్లి శివారులోని జాతీయ రహదారిపై జరిగింది.

Road accident
కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 26, 2022, 4:43 AM IST

Road accident: ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. చావులోనూ వారి స్నేహబంధం విడదీయలేకపోయింది. కామారెడ్డి జిల్లా రామేశ్వర్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

కామారెడ్డిలోని రాజీవ్​నగర్ కాలనీకి చెందిన రాహుల్(20), షఫీ(17) ఇద్దరు స్నేహితులు. రాహుల్ మున్సిపల్ కార్మికునిగా పని చేస్తుండగా షఫీ బోర్ వెల్ షాపులో పని చేస్తున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి బైకుపై రామేశ్వర్ పల్లి గ్రామానికి బయలుదేరారు. రామేశ్వర్ పల్లి నుంచి తిరిగి వస్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకునేందుకు యత్నించారు. అదే సమయంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బైకును ఢీకొట్టి సుమారు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.

ఈ ఘటనలో బైకుపై ఉన్న రాహుల్, షఫీ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాణస్నేహితులు రాహుల్, షఫీ ఇద్దరి మృతి ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ ఏడాదిలో అదే ప్రాంతంలో సుమారు 10 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారని కాలనీ వాసులు తెలిపారు. యూటర్న్ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.