ETV Bharat / crime

కంటైనర్​లో మంటలు.. ఇద్దరు సజీవదహనం

విద్యుత్​తీగలు కంటైనర్​కు తగలి... ఇద్దరు సజీవదహనమైన ఘటన ఉప్పల్​లో చోటు చేసుకుంది. మృతులు రాజస్థాన్​కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

two-drivers-burned-alive-in-container-caught-fire-at-uppal
కంటైనర్​లో మంటలు.. ఇద్దరు సజీవదహనం
author img

By

Published : May 5, 2021, 12:16 PM IST

Updated : May 5, 2021, 12:34 PM IST

హైదరాబాద్‌ ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. కంటైనర్‌కు మంటలు అంటుకొని ఇద్దరు సజీవదహనం అయ్యారు. రాజస్థాన్‌కు చెందిన సెహ్జద్‌, బిహార్‌ వాసి గంగసాగర్‌ గుజరాత్‌ నుంచి కార్ల లోడుతో కంటైనర్‌ తీసుకొని బయలుదేరారు.

కంటైనర్​లో మంటలు

తెల్లవారుజామున ఉప్పల్‌ పారిశ్రామిక వాడకు చేరుకున్న వీరు... అక్కడ మోడ్రన్‌ బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన కంటైనర్‌ నిలిపి నిద్రపోయారు. ఈ క్రమంలో కంటైనర్​పై ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి... మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. కంటైనర్‌లోని కొన్ని కార్లు కాలిపోగా.. మరికొన్ని దెబ్బతిన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు

Last Updated : May 5, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.