ETV Bharat / crime

వాగులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి - మహబూబాబాద్ జిల్లా నేర వార్తలు

ఉగాది పండుగ కోసం వచ్చిన వారి కుటుంబాల్లో విషాదం మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను వాగు మింగేసింది. చిన్నారులను తనలో కలిపేసుకుంది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Two children drowned in a river
చిన్నారుల మృతి
author img

By

Published : Apr 16, 2021, 12:06 PM IST

మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారు మున్నేరు వాగులో గురువారం సాయంత్రం గల్లంతైన సాయి సహస్ర(8) మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున లభ్యమైంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో యస్వంత్ (10), సాయి సహస్ర (8) ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో తెలిసిన వారి ఇళ్లల్లో గాలించారు. ఎక్కడా వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సమయంలో ఓ బాటసారి మున్నేరు వాగు పక్కన ఇద్దరి చెప్పులు కనిపించాయని చెప్పటంతో స్థానికులంతా మున్నేరు వాగు వద్దకు వెళ్లి వాగులో గాలించగా.. యస్వంత్ మృతదేహం లభ్యమైంది.

తెల్లవారుజామున మరో మృతదేహం లభ్యం

కాని సహస్ర మృతదేహం లభ్యం కాలేదు. బాగా చీకటి పడడం, వాగులో ప్రవాహం పెరగటంతో గాలింపును నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్థులు మళ్లీ వాగులో గాలించగా.. సాయి సహస్ర మృతదేహం కూడా లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం రెండు మృతదేహాలను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్​ బాబు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

ఉగాది పండుగ కోసం వచ్చారు

ఉగాది పండుగ కోసం యశ్వంత్ అతని తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి, సహస్ర... ఆమె తల్లి మహబూబాబాద్ నుంచి జమాండ్లపల్లికి వచ్చారు. గ్రామంలో వీరి ఇళ్లు పక్క పక్కనే కావటంతో మూడు రోజుల నుంచి కలిసి ఆడుకున్నారు. గురువారం కూడా ఆడుకునేందుకు బయటికి వెళ్లి వాగులో గల్లంతయ్యారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.