ETV Bharat / crime

ఆస్తి ముందు అన్నైనా తక్కువే.. చనిపోయినా కనికరం చూపరాయె - brothers did not allow their brother's deadbody

"రూపాయి రూపాయి నువ్వేం చేస్తావనడిగితే.. హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. తండ్రీబిడ్డల్ని విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని కూడా విడగొడతాను అందట" అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. డబ్బు, ఆస్తి అనేవి బంధాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చెప్పే డైలాగ్ ఇది. అచ్చం ఇలాగే ఓ తమ్ముడు ఆస్తి ముందు అన్నైనా తక్కువే అనుకున్నాడు. ఓ అన్న డబ్బు కంటే తమ్ముడు ఎక్కువేం కాదని భావించాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు వారి మరో సోదరుడు మరణిస్తే కనీసం శవాన్ని ఇంట్లోకి కూడా రానీయలేదు. కారణం ఆస్తి తగాదాలు.

kamareddy crime news
kamareddy crime news
author img

By

Published : May 10, 2022, 1:44 PM IST

ఆస్తి ముందు అన్నైనా తక్కువే.. చనిపోయినా కనికరం చూపరాయె

తోడబుట్టిన అనుబంధాన్ని మంటగలిపారు. ప్రాణాలతో లేడని కనికరాన్నైనా చూపలేకపోయారు. ఆస్తి ముందు అన్నైనా సరే తక్కువే అనుకున్నారు. చనిపోయిన వ్యక్తిని... పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబాన్ని రోడ్డున వదిలేసి.... మానవత్వాన్ని మరిచిన ఘటన కామారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.

అయ్యప్పనగర్‌కు చెందిన రాజేశానికి ముగ్గురు కుమారులు శ్రీనివాస్, సంజీవ్, కిరణ్‌. 15ఏళ్ల క్రితం సంజీవ్‌ ప్రేమవివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో సంజీవ్ తండ్రి తన ఆస్తిని మిగతా ఇద్దరి కుమారులకు ఇచ్చాడు. కానీ సంజీవ్ తానేం తప్పు చేయలేదని.. తన తండ్రి ఆస్తి తనక్కూడా చెందుతుందని.. ఆస్తి విషయంలో పలుమార్లు అన్నదమ్ములను అడగటంతో గొడవలు జరిగాయి.

రెండ్రోజుల క్రితం కామారెడ్డిలో రైలు కింద పడి... సంజీవ్‌ చనిపోయాడు. సోమవారం రోజున పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య కల్పన, కుమారులు అద్దె ఇంట్లోకి మృతదేహాన్ని అనుమతించకపోవడం వల్ల సంజీవ్‌ మృతదేహాన్ని అయ్యప్పనగర్‌లోని సొంతింటికి తీసుకువెళ్లారు. కానీ.. సంజీవ్ అన్నదమ్ములు అతడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు అంగీకరించలేదు. ఏం చేయాలో పాలుపోక మృతుడి భార్య, కుమారులు 6 గంటల పాటు రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి, వేచి చూశారు. అయినా ఫలితం లేకపోవటంతో పోలీసుల జోక్యంతో కుల పెద్దలు సంజీవ్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

నాన్న చనిపోయిండని మాకు తెల్వది : "మా నాన్న చనిపోయాడని మాకు ఇవాళ్టి వరకు తెలియదు. బయటకు పోయి ఇంకా రాకపోతే ఏదో పని మీద వెళ్లాడనుకున్నాం. కానీ పోలీసులు మా ఇంటికి వచ్చి శవాన్ని చూపించి గుర్తుపట్టమన్నారు. అది మా నాన్న శవమే. మా నాన్నను మేం నానమ్మ ఇంటికి తీసుకెళ్తే.. వాళ్లు లోపలికి రానీయలేదు. ఏవో ఆస్తి గొడవలున్నాయట. నాన్న శవాన్ని బయటపెట్టి 6 గంటల నుంచి నేనూ అమ్మ, తమ్ముడు బయటే కూర్చున్నాం. మాకు ఎవలు సాయం చేస్తలేరు."

- మృతుడి కుమారుడు

చనిపోయినా కనికరం లేదు : "నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భర్తను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. అప్పట్నుంచి సంజీవ్ తన కుటుంబంతో కలవాలని చాలా ప్రయత్నించాడు. కానీ వాళ్ల నాన్న, అన్నదమ్ములు తనని క్షమించలేదు. నా భర్త మీద కోపంతో మా మామయ్య ఆస్తంతా తన మిగతా ఇద్దరి కొడుకుల పేరు మీద రాశాడు. ఆ విషయమై నా భర్తకు.. వాళ్లకు తరచూ గొడవ జరుగుతుండేది. ఎంత బాధుండేనో.. నా భర్తకు ఎవలకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు పోయి రైలు కింద పడి చనిపోయిండు. ఇన్నేళ్ల నుంచి లోపల ఎంత కుమిలిపోయిండో. వీళ్లు బతికున్నప్పుడు నా భర్తను పట్టించుకోలేదు. ఇప్పుడు చనిపోయినా కూడా కనికరం చూపుతలేరు. కనీసం ఇంట్లకి రానిస్తలేరు."

- మృతుడి భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.