మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మృతదేహాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. గ్రామ చెరువులో రెండు మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు.
చెరువు సమీపంలో ద్విచక్రవాహనాన్ని కూడా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదమా? ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్ల కేసులో మరో నిందితుడు అరెస్ట్