ETV Bharat / crime

Accident: బైక్​పై పెట్రోల్​తో ప్రయాణం.. చేసింది పెద్ద గాయం.! - two bikes collided news

నల్గొండ జిల్లా త్రిపురారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఘటనలో ఒక వాహనదారునికి తీవ్రగాయాలయ్యాయి.

bikes collided
మంటల్లో బైక్​
author img

By

Published : Aug 2, 2021, 7:01 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారంలో రెండు బైక్‌లు ఢీకొని మంటలు చెలరేగాయి. ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాబుసాయిపేటకు చెందిన కాటేపల్లి మల్లయ్య.. దుకాణంలో పెట్రోల్​ అమ్మేందుకు బైక్​పై వెళ్తున్నాడు. ఆ సమయంలో త్రిపురారం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

ప్రమాద దృశ్యాలు

ప్రమాదంలో బైక్‌ రోడ్డుపై పడటంతో పెట్రోల్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు మల్లయ్యకు అంటుకోవడంతో... అతని శరీరం కాలిపోయింది. పక్కనే ఉన్న దాబా సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పినప్పటికీ... అప్పటికే మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Gachibowli Accident: సరదాగా సాగిన వాళ్ల ఫ్రెండ్​షిప్​డే.. తీరని విషాదంతో ముగిసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.