గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఇద్దరు యాచకులు గొడవ(Beggars Conflict in train) పడ్డారు. మద్యం మత్తులో ఇద్దరు ఒకరిపై ఒకరు రాళ్లు, బ్లేడ్‌తో దాడి చేసుకున్నారు. వీరి ఘర్షణ కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో రైలును 10 నిమిషాల పాటు నిలిపివేశారు.
రైలు కదిలిన కొద్దిసేపటికే యాచకులు మళ్లీ దాడి(beggars clash news) చేసుకోవడంతో... ప్రయాణికులు రైలును ఆపి... ఇద్దరిని దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: young man suicide: వివాహిత తనతో మాట్లాడటం లేదని యువకుడి ఆత్మహత్య