ETV Bharat / crime

TSRTC CCS: అప్పు చెల్లించకపోతే... దివాళా తీయాల్సిందే

ఒకప్పుడు ఆసియా ఖండంలోని ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆర్టీసీ కో-ఆపరేటీవ్ సొసైటీ సంఘం(RTC Co-operative Society Association) ఇప్పుడు దివాళా తీసి... మూసివేసే దశకు చేరుకుంది. అత్యంత పారదర్శకంగా వ్యవహరించే ఈ సంఘానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది...? సీసీఎస్ నిధులను ఎవరు వాడుకున్నారు? వాడుకున్నవాళ్లు ఎందుకు చెల్లించడంలేదు? ఇంత జరుగుతున్నా.. యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదు?

author img

By

Published : Jun 17, 2021, 4:13 PM IST

tsrtc-ccs-in-bankrupt-situation-because-of-rtc
TSRTC CCS: ఆర్టీసీ అప్పు చెల్లించకపోతే... దివాళ తీయాల్సిందే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 1952లో ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సంఘం(RTC Co-operative Society Association)ను స్థాపించింది. ఆ సమయంలో 2,558 మంది సభ్యులతో సుమారు రూ.60వేల వాటాధనంతో... 71,700ల పొదుపు జమలతో, ఐదుగురు సభ్యులతో దీనిని ఏర్పాటు చేశారు. తక్కువ జీతం వచ్చే కార్మికులు, ఉద్యోగులు అప్పులు చేసినా.. వడ్డీ వ్యాపారుల బారిన పడవద్దనే ఉద్దేశ్యంతో సీసీఎస్​ను స్థాపించారు.

అవసరాల కోసం ఉపయోగపడేలా

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో టీఎస్ఆర్టీసీ సీసీఎస్​(TSRTC CCS)గా ఆవిర్భవించింది. ప్రస్తుతం సీసీఎస్(CCS)​లో 46 వేలమంది సభ్యులు ఉన్నారు. రూ.1600 కోట్ల టర్నోవర్​కు చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు అంతర్గతంగా పొదుపు చేసుకుని అవసరమైనప్పుడు రుణాలు పొందే ఉద్దేశ్యంతో సీసీఎస్​ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నెలా జీతం నుంచి మినహాయించిన 7.5శాతం సొమ్ము ఈ సంఘానికి చేరుతుంది. దీంతో సొసైటీ టర్నోవర్ 1,600ల కోట్లకు చేరుకుంది. ఈ సొమ్ము బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఉద్యోగులకు తక్కువ వడ్డీకీ హౌసింగ్ లోన్, పిల్లల పెళ్ళిళ్లకు, చదువుల కోసం రుణాలు ఇవ్వడం ద్వారా సంఘానికి ఆదాయం సమకూరుతుంది.

నిధులు వాడేసుకున్న ఆర్టీసీ

కానీ.. సరైన పర్యవేక్షణ లేక నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ.. మెల్లగా సొసైటీ నిధులను వాడేసుకోవడం మొదలుపెట్టింది. మాతృసంస్థ.. ఆర్టీసీ సీసీఎస్ నుంచి రూ.900ల కోట్లు తమ అవసరాల కోసం వాడుకుంది. రెండేళ్లు గడిచినా ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే దాని వడ్డీ రూ.172 కోట్లకు పెరిగిపోయింది. దీంతో సభ్యులకు చెల్లించాల్సి వచ్చిన నగదును చెల్లించే సమయంలో సీసీఎస్ అనేక ఇబ్బందులు పడుతోంది. సమయానికి డబ్బు కావాలని వచ్చే సభ్యులకు లేవని చెప్పలేక.. సీసీఎస్ పాలకమండలి సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇదే సొమ్మును బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే.. ఇలాగే వ్యవహరిస్తుందా..? అని సీసీఎస్ పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిధులు వాడుకుని.. కొంత మాత్రమే చెల్లించడంవల్లనే దివాళ తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

మాఫీ చేయడమే కష్టంగా ఉంది

సీసీఎస్​లో సభ్యత్వం తీసుకున్న సభ్యులు ఏదేని కారణం చేత మరణిస్తే.. వారికి సాయం కింద రూ.5లక్షల భీమా మొత్తాన్ని చెల్లిస్తారు. మరణించిన వ్యక్తి సీసీఎస్​లో లోన్ తీసుకుంటే.. చనిపోయిన తర్వాత ఆ లోన్​ను మాఫీ చేసేవారు. కరోనా సమయంలో గతేడాది నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 415 మంది వివిధ కారణాలతో చనిపోయారని.. అందులో 120 మంది కార్మికులు కరోనాతో మృత్యువాతపడ్డారని సీసీఎస్ పాలకమండలి సభ్యులు తెలిపారు. చనిపోయిన వారందరికి రూ.5లక్షల బీమా చెల్లించినప్పటికీ... వారు తీసుకున్న లోన్​ను ఇప్పుడు మాఫీ చేయడం సీసీఎస్​కు ఆర్థికంగా భారమవుతుందని పాలకమండలి సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

సెటిల్​ చేయాలంటూ దరఖాస్తులు

సీసీఎస్ సంస్థకు ఎక్స్ అఫీషియో ఛైర్మన్​గా ఆర్టీసీ ఎండీ వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) స్థాయి అధికారి వైస్ ఛైర్మన్​గా నియమిస్తారు. ప్రస్తుతం ఛైర్మన్​గా సునీల్ శర్మ, వైస్ ఛైర్మన్​గా యాదగిరిలు కొనసాగుతున్నారు. ఈడీ యాదగిరి మే నెల రెండో వారంలో తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని... తనకు రావాల్సిన రూ.22 లక్షలు చెల్లించాలని సీసీఎస్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న యాదగిరి సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారంటే.. ఇక మా పరిస్థితి ఏంటని.. మిగిలిన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు సభ్యత్వాన్ని రద్దు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. తమకు రావాల్సిన మొత్తాన్ని సెటిల్ చేయాలంటూ కోరుతున్నారు. ఇప్పటి వరకు 12,000ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో సీసీఎస్​ను నిర్వహించడం సాధ్యంకాదని ఉద్యోగులకు, కార్మికులకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ.. సొసైటీ పాలకమండలి తాజాగా ఆర్టీసీ యాజమాన్యానికి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​కు లేఖ రాసింది. అయినప్పటికీ స్పందన రాలేదని పాలకమండలి పేర్కొంది. మరోపక్క సభత్వం రద్దు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని వెల్లడించింది. ఈ విషయమై మరోమారు కోర్టును ఆశ్రయిస్తామని పాలకమండలి స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి: Highcourt: దేవరయాంజల్​ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.