ETV Bharat / crime

TRS and Congress Fight at Achampet : అచ్చంపేటలో కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ - TRS and Congress Fight

TRS and Congress Fight at Achampet: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించగా.. తెరాస కార్యర్తలు అడ్డుకున్నారు. కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలపై తెరాస కార్యకర్తలు దాడికి యత్నించారు.

TRS and Congress Fight at Achampet
TRS and Congress Fight at Achampet
author img

By

Published : Feb 7, 2022, 2:38 PM IST

అచ్చంపేటలో కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

TRS and Congress Fight at Achampet : నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గువ్వల సమర్థించారని నాగర్​కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపును ముట్టడించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు పెద్దఎత్తున క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

TRS and Congress Activists Fight at Achampet : అప్పటికే ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులకు.. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడికి తెరాస కార్యకర్తలు కూడా చేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇటు తెరాస కార్యకర్తలు, అటు పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలపై తెరాస కార్యకర్తలు దాడికి యత్నించారు. వారిని శాంతింపజేయడానికి పోలీసులు ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను చెదరగొట్టి.. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.