తెలుగు అకాడమీ నిధుల(Telugu Academy Funds scam) గోల్‌మాల్ కేసులో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. నారాయణగూడలోని అకాడమీ కార్యాలయానికి చేరుకున్న కమిటీ... తెలుగు అకాడమీ సంచాలకుడు సోమిరెడ్డితో పాటు మరికొంత మందిని ప్రశ్నించింది. రూ. 43 కోట్లు బ్యాంకు నుంచి ఏ విధంగా విత్‌డ్రా అయ్యాయని కమిటీ సభ్యులు ఆరా తీస్తున్నారు. 3గంటల పాటు కమిటీ సభ్యులు అకాడమీ(Telugu Academy Funds scam) కార్యాలయంలో విచారణ కొనసాగించారు.
అంతకుముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) అధికారులను కూడా త్రిసభ్య కమిటీ విచారించింది. బ్యాంకుకు చెందిన రికార్డులను సభ్యులు పరిశీలించారు. మరో వైపు సీసీఎస్ పోలీసులూ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిధుల గోల్‌మాల్‌లో బ్యాంకు అధికారుల పాత్రే ఉందని తెలుగు అకాడమీ(Telugu Academy Funds scam) అధికారులు చెబుతున్నారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం అకాడమీ సిబ్బందే డబ్బులు విత్‌డ్రా చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి అకాడమీ అధికారులపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ స్కామ్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నగదు గోల్‌మాల్ అయ్యింది(Telugu Academy Funds scam). యూబీఐ బ్యాంక్‌లో తాము డిపాజిట్ చేసిన రూ.43కోట్లు బ్యాంకులో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారంటూ యూబీఐ ఉన్నతాధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ తమ వద్ద ఉంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం రూ.54.41కోట్లుగా బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలిపారు. రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న బ్యాంక్ అధికారులు, తెలుగు అకాడమీ ప్రతినిధులను విచారించిన అనంతరం దర్యాప్తు మొదలు పెట్టనున్నారు.
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రూ. 26కోట్లు ఏమయ్యాయి.?
గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేశారు. అనంతరం ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. రూ.5.70 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చామని వివరించారు. ఈ రూ. 26 కోట్లు ఏమయ్యాయనే వ్యవహారంపై సీసీఎస్ దర్యాప్తు ప్రారంభించింది. గోల్‌మాల్ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ (tripartite committee)ని నియమించింది.
ఇదీ చదవండి: Fixed Deposits Scam In Telugu Academy: ఎఫ్‌డీల్లో మాయాజాలం.. విత్‌డ్రా చేసిందెవరు? ఫోర్జరీ జరిగిందా?
Telugu Academy Funds scam: తెలుగు అకాడమీలో గోల్‌మాల్.. రూ.43 కోట్ల మాయాజాలం