Transformer blast at Nampally : హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్ హిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలి పక్కన ఉన్న అపార్ట్మెంట్లోకి మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం రావడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి : Illegal water connection in Hyderabad : గ్రేటర్లో అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం