ETV Bharat / crime

LIVE VIDEO: డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి - young men attacked trainee si in nalgonda

trainee si was beaten, trainee si was beaten in nalgonda
ట్రైనీ ఎస్సై, ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి
author img

By

Published : Jun 15, 2021, 10:48 AM IST

Updated : Jun 15, 2021, 6:13 PM IST

10:46 June 15

నల్గొండ: డిండి మం. బురాన్‌పూర్‌ తండాలో ట్రైనీ ఎస్సైపై దాడి

డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి

నల్గొండ జిల్లా డిండి మండలం బురాన్​పూర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోలింగ్​లో భాగంగా.. సోమవారం రాత్రి బురాన్​పూర్ తండా వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు గుంపులు గుంపులుగా చేరి.. డీజే పెట్టుకుని నృత్యాలు చేయడం గమనించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిని పోలీసులు హెచ్చరించారు. నృత్యాలు ఆపివేయాలని ఆదేశించారు. ఇదేం లెక్కచేయని యువకులు ట్రైనీ ఎస్సై కిరణ్​పై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. పోలీసు వాహనంపై అక్కడే ఉన్న కుర్చీలతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.అతి కష్టం మీద పోలీసులు అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై దాడికి దిగిన 10 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు

Last Updated : Jun 15, 2021, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.