కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
చిగురుమామిడి గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు(30) తనకున్న పొలంలో ట్రాక్టర్‌తో గొర్రు కొడుతుండగా అదుపుతప్పింది. అతనిపై బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు(5) ఉన్నారు. ఆంజనేయులు మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అంత్యక్రియలకు హాజరై వస్తుండగా.. దుండగుల దాడి