హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మునవర్ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ పేరుతో వ్యాన్లను నడిపిస్తున్నాడు. డ్రైవర్, క్లీనర్‌తో కలిపి ఓ వ్యాన్‌ను బీదర్‌కు పంపించాడు. అక్కడ ఆర్ఆర్ కంపెనీకి చెందిన పొగాకు ఉత్పత్తులను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ ప్రయాణయ్యారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి రహదారి వద్దకు చేరుకున్న తర్వాత వ్యాన్‌ను అక్కడే నిలిపి కొంతమంది వ్యాపారులకు పొగా(Tobacco)కు ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి మునవర్ పరారీలో ఉన్నాడు.
ఇదీ చదవండి: తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు