హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్.. మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటన సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో టిప్పర్ని తొలగించారు. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: డ్రగ్స్ సరఫరా కేసులో ఇద్దరు నైజీరియన్ల అరెస్టు