Thums up load Lorry Bolta : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘట్‌కేసర్ మార్గంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు థమ్స్‌అప్ లోడ్‌తో వెళుతున్న లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి రింగ్ రోడ్డులోని విభాగినిపై పడిపోయింది. దీంతో లారీలోని థమ్స్‌అప్ శీతల పానీయం సీసాలు రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని పట్టించుకోకుండా వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి అందిన కాడికి ఆ సీసాలను తీసుకెళ్లారు. కొంతసేపట్లోనే లారీలోని మొత్తం సరకు ఖాళీ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
- ఇదీ చదవండి : జనావాసంలోకి చిరుత.. ఆశ్రమంలోని కుక్కలపై దాడి