ETV Bharat / crime

షాప్ ముందు నిలిపిన వాహనాన్ని తీయమన్నందుకు.. యాజమానిపై దుండగుల దాడి

Attack on Automobile Shop Owner: రాజేంద్రనగర్​లో క్యాబ్ డ్రైవర్​పై దాడి ఘటన మరవక ముందే తాజాగా అత్తాపూర్​లో జరిగిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. షాప్​ ముందు నిలిపిన వాహనాన్ని తీయాలని ఓ యాజమాని సూచించాడు. ఈ క్రమంలోనే 20 మంది దుండగులు ఒక్కసారిగా షాప్​లోకి చొరబడి ఆయనపై దాడికి పాల్పడ్డారు.

Attack
Attack
author img

By

Published : Dec 6, 2022, 5:20 PM IST

Attack on Automobile Shop Owner: హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ఆటోమొబైల్‌షాప్‌ యజమానిపై దుండగులు దాడిచేశారు. ఇటీవల రాజేంద్రనగర్‌లో క్యాబ్ డ్రైవర్‌పై దాడి మరవక ముందే తాజా ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సంపత్‌రెడ్డి అనే వ్యక్తి తన షాప్‌ ముందు నిలిపిన వాహనాన్ని పక్కకు తీయాలని సూచించాడు. ఈ క్రమంలోనే షాప్‌లోకి చొరబడిన 20మంది... సంపత్‌పై పిడిగుద్దులతో రెచ్చిపోయారు.

దుకాణంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి... అందులోని వస్తువులతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన సంపత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దండుగులంతా గంజాయి సేవించి ఉన్నారని... ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సేవించి తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంపత్ రెడ్డి సైబరబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.