మితిమీరిన వేగం ఆ ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. ఓవైపు ట్రిపుల్ రైడ్.. మరోవైపు హెల్మెట్ లేకుండా ప్రయాణం.. ఇంకోవైపు అతివేగం.. నిర్లక్ష్యమే వారి ఉసురు తీసింది. హైదరాబాద్ నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(ACCIDENT)లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల కిందపడ్డారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రెడీమిక్స్ వాహనం వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటన(ACCIDENT)లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాస్త్రిపురంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లివస్తుండగా ప్రమాదం(ACCIDENT) చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను మహారాష్ట్రకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్‌గా గుర్తించారు. వీరు లంగర్‌హౌస్‌లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం(ACCIDENT) జరిగినప్పుడు వారు హెల్మెట్ ధరించకపోవడం.. అతివేగం.. ట్రిపుల్ రైడ్ ఇవే ఘటనకు ప్రధాన కారణాలుగా పోలీసులు గుర్తించారు. వాహనం నడిపేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం సురక్షితం కాదని తెలిపారు. ట్రిపుల్ రైడ్ వంటి నిర్లక్ష్యానికి భారీ జరిమానాలు విధిస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకుండా ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని ప్రవర్తించాలని కోరారు.