ETV Bharat / crime

కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి - accident in Nellore updates

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని.. పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు.

Three workers killed in accident in Nellore district
కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి
author img

By

Published : Mar 23, 2021, 8:00 AM IST

Updated : Mar 23, 2021, 10:21 AM IST

నెల్లూరు జిల్లా.. దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురుకి తీవ్రగాయాలయ్యాయి. దువ్వూరుకు చెందిన కూలీలు చేపల వేట కోసం విడవలూరు వెళ్లేందుకు రోడ్డు వద్ద మినీ లారీ ఎక్కుతున్నారు. అతివేగంగా వచ్చిన పాల వాహనం వారి పైనుంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు కూలీలు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల వ్యానులో ఇరుక్కుపోయిన వ్యాన్ డ్రైవర్​ను అతి కష్టం మీద బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని బుచ్చిరెడ్డి పాలెం సీఐ సురేష్ బాబు పరిశీలించారు.

కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి

ఇదీ చదవండి: 30 శాతం ఫిట్‌మెంట్‌.. 61 ఏళ్లకు రిటైర్‌మెంట్‌

Last Updated : Mar 23, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.