జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో సినీఫక్కీలో జరిగిన చోరీ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఉండవెల్లి మండలం కలగొట్ల గ్రామానికి చెందిన గొర్ల కాపరి పెద్ద మల్లయ్య అలంపూర్ చౌరస్తా సమీపంలో గొర్రెలు మేపుతున్నాడు. ఆ సమయంలో కర్నూలు పట్టణం కప్పల్నగర్కు చెందిన రాజు, మరో ఇద్దరు కలిసి గొర్రెను అపహరించి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. కర్నూల్ వైపు పారిపోతుండగా గొర్రెల కాపరి మల్లయ్య, మరో వ్యక్తితో కలిసి పారిపోతున్న వారిని ద్విచక్రవాహనంతో వెంబడించారు.
పుల్లూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత పెద్ద మల్లయ్య దుండగుల వాహనానికి దగ్గరగా సమీపించడం వల్ల... గమనించిన దొంగలు వెంబడిస్తున్న వారి బైక్ను కాలితో తన్నారు. ద్విచక్రవాహనం లారీ కింద పడగా మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దొంగల వాహనం కూడా కిందపడడంతో ఒకరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు పరారయ్యారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్