కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పాలసముద్రం మండలం కనికాపురంలో ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కొల్పోయారు.
కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం జీడీ నెల్లూరు మండలం వేల్పూరు పెద్ద కాలువ నుంచి టిప్పర్‌లో కంకరు తెప్పించారు. మునిస్వామి నాయుడు ఇంటి సమీపంలో కంకరను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ ప్రవహించింది. దీంతో డ్రైవర్ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్, దొరబాబు కూడా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ACCIDENT: బస్టాండు ఎదుటే రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు