ETV Bharat / crime

BLACK FUNGUS: ఆగని బ్లాక్ మార్కెట్ దందా.. ముగ్గురు అరెస్ట్ - బ్లాక్​ ఫంగస్​ ఇంజక్షన్ల విక్రయం

పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా బ్లాక్​ మార్కెట్ దందా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం బ్లాక్​ ఫంగస్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్​లో దందాకు పాల్పడుతున్న ముగ్గురిని నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 36 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Three persons arrested in Black fungus injections
బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
author img

By

Published : Jun 21, 2021, 7:53 PM IST

హైదరాబాద్​లో బ్లాక్​ మార్కెట్​ దందా కొనసాగుతూనే ఉంది. అధిక డబ్బుల సంపాదన కోసం అక్రమార్కులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ​ఆంపోటెరిసిన్​-బి ఇంజక్షన్లను విక్రయిస్తుండగా ముగ్గురిని నార్త్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 36 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ వెల్లడించారు.

నిందితులు ఇంజక్షన్లను ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.8 వేల ధర ఉన్న ఇంజక్షన్లను అక్రమంగా రూ.30 నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారని సీపీ వెల్లడించారు. అధిక ధరకు ఇంజక్షన్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

రెమ్​డెసివిర్, బ్లాక్​ ఫంగస్​ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్​పై ఇప్పటివరకు హైదరాబాద్​లో 58 కేసులు నమోదు చేశాం. 136 మందిని అరెస్ట్ చేశాం. 450 ఇంజక్షన్లను సీజ్ చేశాం. ప్రజలు, మీడియా ఎవరికైనా ఇలాంటి సమాచారం తెలిస్తే 9490616555 నంబర్​కు వాట్సాప్​ ద్వారా తెలియజేయండి. -అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

ఇదీ చూడండి: drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.