missing in Gundlakamma river: ఏపీ గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గల గుండ్లకమ్మ నదిలో.. ఈతకోసం దిగి గల్లంతైన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు వెలికితీశారు. వీరిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. వినుకొండలో ఓ శుభకార్యానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీచూడండి: శివరాత్రి రోజే ఘోరం.. యాక్సిడెంట్లో ఆరుగురు భక్తులు మృతి