ETV Bharat / crime

రెండేళ్లుగా ద్విచక్రవాహనాల చోరీ.. మొదటిసారి అరెస్ట్​.. 53 బైకులు స్వాధీనం..

Two wheelers theft: రెండేళ్లుగా ద్విచక్రవాహనాలు దొంగిలిస్తోన్న ముగ్గురు సభ్యుల ముఠాను పాతబస్తీ చాంద్రాయణ్​గుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఏకంగా 53 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Two wheelers theft
రెండేళ్లుగా ద్విచక్రవాహనాల చోరీ
author img

By

Published : Jun 11, 2022, 6:54 PM IST

Updated : Jun 11, 2022, 7:15 PM IST

Two wheelers theft: హైదరాబాద్​లో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 53 ద్విచక్రవాహనాల​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని బడంగ్​పేట్​కు చెందిన మాచర్ల శ్రీకాంత్ మోహన్, షాద్​నగర్​లో సమీపంలోని కేశంపేట్, చౌలపల్లి గ్రామాలకు చెందిన గణేశ్, సత్తు శ్రీశైలంను అరెస్ట్ చేశారు.

ముగ్గురు స్నేహితులైన నిందితులు.. విలాసాలకు అలవాటుపడి రెండేళ్లుగా ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఫైనాన్స్​ కంపెనీలు సీజ్​ చేసిన వాహనాలు అని చెప్పి గ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య వెల్లడించారు.

ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనం దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చాంద్రాయణగుట్ట క్రాస్​ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు మాచర్ల శ్రీకాంత్ మోహన్​ను అదుపులోకి తీసుకోవటంతో.. రెండేళ్లుగా సాగుతున్న దందా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో శ్రీకాంత్ మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లు చెప్పడంతో వాళ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​ మధుసూదన్ రెడ్డి, చాంద్రాయాణ్​గుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​వర్మను ఉన్నతాధికారులు అభినందించారు. డీఎస్ఐ గౌస్ ఖాన్, కానిస్టేబుళ్లు ప్రశాంత్, నిఖిల్, ప్రవీణ్, ఏఎస్సై సీతాపతికి డీసీపీ సాయి చైతన్య, ఫలక్​నుమా ఏసీపీ.. రివార్డులు అందజేశారు.

ఇవీ చదవండి:

ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన

వరుడు కావాలని యాడ్ ఇచ్చిన యువతి.. అబ్బాయి అలా ఉంటేనే పెళ్లి..!

Last Updated : Jun 11, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.