ETV Bharat / crime

Love cheating: ప్రేమన్నారు.. కోర్కెలు తీర్చుకున్నారు.. ఆపై - sexual harassment news

ప్రేమించానంటూ యువకుడు ఓ యువతి వెంట పడ్డాడు... పెళ్లి చేసుకుంటానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఎంతో కాలం అవకాశం కోసం ఎదురుచూసి.. నగ్న ఫొటోలు సేకరించాడు.. ఆ తరువాత అమ్మాయిని బ్లాక్​మెయిల్​ చేస్తూ.. గొడవకు దిగేవాడు... కార్యాలయానికి వెళ్లినా అక్కడకు వచ్చి ఘర్షణ పడేవాడు. ఇదే సమయంలో సహోద్యోగి సైతం అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ వ్యవహారం తెలిసిన పురోహితుడు సైతం ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మోసం చేశాడు... పెళ్లి సంబంధాలూ చెడగొట్టాడు. చివరికి ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు... ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.

love story
Love cheating: ప్రేమన్నారు.. కోర్కెలు తీర్చుకున్నారు.. ఆపై
author img

By

Published : Jun 8, 2021, 7:44 PM IST

యువతిని ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పాటు ఆమెను బ్లాక్​మెయిల్‌ చేసి వంచించిన మరో ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి పంపించారు. యువతి భయాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆమె జీవితంతో చెలగాటమాడి..కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో చేసుకుంది.

సీఐ లక్ష్మణరావు కథనం ప్రకారం..

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ అభ్యసించింది. ఆ సమయంలో వల్లరిగుడబ గ్రామానికి చెందిన వాసుదేవరావు.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కొంతకాలం ఇద్దరూ స్నేహంగా తిరిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె స్నానం చేస్తున్న ఫొటోలను సేకరించాడు. డిగ్రీ పూర్తయ్యాక యువతి ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఆమె పట్ల ఇష్టపడుతున్నట్లు నటిస్తూ వచ్చాడు. సదరు యువతి ప్రియుడు వాసుదేవరావు ఆమె పనిచేసే చోటకు వచ్చి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇది గమనించిన యువతి సహోద్యోగి ఆమెను బ్లాక్​మెయిల్​ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు. అంతేకాక ఆమెను బెదిరిస్తూ వచ్చాడు. ఇద్దరి నుంచి మోసపోయిన ఆమె వ్యవహారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఓ పురోహితుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. యువతికి చెందిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ బ్లాక్​మెయిల్​ చేసి శారీరకంగా లొంగదీసుకున్నాడు.

జాతకాలు చూస్తానన్నాడు..పెళ్లి జరగకుండా చేశాడు

ఇంతలో యువతికి కుటుంబ సభ్యులు ఓ సంబంధం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న పురోహితుడు జాతకాలు చూస్తానని చెప్పి పెళ్లి కుమారుడి కుటుంబీకుల వివరాలు సేకరించాడు. యువతి ప్రేమ వ్యవహారాలు ఆ కుటుంబ సభ్యులకు చేరవేశాడు. అయినా వారు అమ్మాయి పట్ల నమ్మకముంచారు. ఈ విషయం తెలుసుకున్న పురోహితుడు యువతి నగ్న ఫొటోలను పెండ్లి కుమారుడు కుటుంబీకులకు చేరవేశాడు. వారు ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆరా తీశారు.

ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి సంబంధం చెడిపోకూడదని యువతి భావించింది.. కానీ, అందుకు భిన్నంగా జరగడంతో ఆమె నోరు విప్పింది. తనను మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల వివరాలు వెల్లడించింది. వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధిత యువతి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

ఇవీచూడండి: Murder: కూతురిని పెళ్లి చేసుకున్నాడనే హత్య.. నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.