ETV Bharat / crime

డ్రగ్స్​ కేసులో టోనీ ఏజెంట్లు ముగ్గురు అరెస్ట్​.. రిమాండ్​కు తరలింపు - ts news

Hyderabad Drugs Case: పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో భాగంగా పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టోనీ అనుచరులను ముంబయిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి హైదరాబాద్​ తీసుకువచ్చి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

డ్రగ్స్​ కేసులో టోనీ ఏజెంట్లు ముగ్గురు అరెస్ట్​.. రిమాండ్​కు తరలింపు

author img

By

Published : Feb 4, 2022, 7:23 PM IST

Hyderabad Drugs Case: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీ ఏజెంట్లుగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని పశ్చిమ అందేరికి చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ ఆరిఫ్‌ ఖాన్‌, అఫ్‌తాఫ్‌ అహ్మద్‌ ఖాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఆరిఫ్‌ ఖాన్‌లను పంజాగుట్ట పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. వీరు ముగ్గురు టోనీకి ఏజెంట్లుగా పనిచేసి మాదకద్రవ్యాల తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఎవరెవరికి విక్రయించారనే కోణంలో..

ముంబయిలో ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. వీరు టోనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. టోనీ దాదాపు 15 బ్యాంకు ఖాతాల్లో మాదక ద్రవ్యాల డబ్బులను జమ చేశాడు. అందులో ఆరిఫ్ అనే ఏజెంట్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలోనే కోటి రూపాయలు కేవలం ఆరు నెలల వ్యవధిలో జమ అయినట్లు ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు.

బెంగళూరులోనూ..

మహ్మద్‌ ఆసిఫ్‌ ఆరిఫ్‌ ఖాన్‌ కొంత కమిషన్‌ను తీసుకొని మిగతా డబ్బు మొత్తాన్ని టోనీకి నగదు రూపంలో అందించాడు. ఆ నగదును ఆన్​లైన్ విధానంలో టోనీ నైజీరియాలోని పొలారిస్ బ్యాంకులో ఉన్న స్టార్ బాయ్ ఖాతాలో జమ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. స్టార్‌బాయ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు సేకరించారు. బెంగళూరులోనూ టోనీ, ఏజెంట్లను నియమించుకొని మాదక ద్రవ్యాల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు బెంగళూరు పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.