ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం జరిగింది. ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండ మెయిన్ రోడ్లో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు మేనేజర్ అశ్వర్థయ్య.. రెండు రోజుల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లు నాగరత్నమ్మ, అశ్వర్థమ్మతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిప్పంటించుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: వృద్ధుడిని కొమ్ములతో గుద్ది చంపిన ఎద్దు