Three womens died in accident ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. గణపవరం మండలం వల్లూరు సమీపంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా భీమవారం వాసులుగా గుర్తించిన పోలీసులు.. ఏలూరు శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండుగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఇవీ చదవండి: మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధమన్న కోమటిరెడ్డి
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతు కోసి, ముఖం ఛిద్రం చేసి హత్య