ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం రామచంద్రపురం వద్ద సముద్రతీరంలో.... రెండు రోజుల క్రితం గల్లంతైన.... ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సురేష్ అనే వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఈ రోజు ఉదయం సూర్యలంక తీరంలో రామకృష్ణ, పాండురంగాపురం తీరం ఒడ్డున బ్రమ్మయ్య మృతదేహాలు దొరికాయి.
మృతులంతా ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం వాసులని పోలీసులు తెలిపారు. రామకృష్ణ అనే యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. ఎనిమిది మంది స్నేహితులు సముద్రంలో దిగగా.... ముగ్గురు గల్లంతయ్యారు. వీరి మరణంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.