Car Fire: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో నిలిపి ఉంచిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థంభాలగరువు ప్రాంతంలోని నర్సిరెడ్డిపాలెంలో మూడు కార్లు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. కార్లలో అంతర్గతంగా షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే పక్కనున్న కార్లకు కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే కార్ల యజమానులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.
తక్షణమే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. ఈ లోగా మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్లన్నీ కూడా ఖరీదైనవి కావటంతో రూ.50లక్షల మేర నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: