ETV Bharat / crime

ఫామ్​హౌస్​లో సాఫ్ట్​వేర్​ బర్త్​డే పార్టీ.. 55 మందిపై కేసు..! - rave party in kadthal

Three arrested for organized Birthday celebrations against the rules in kadthal

author img

By

Published : Jun 13, 2021, 11:05 AM IST

Updated : Jun 13, 2021, 1:53 PM IST

10:30 June 13

నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు.. పోలీసులు దాడి

ఫామ్​హౌస్​లో సాఫ్ట్​వేర్​ బర్త్​డే పార్టీ.. 55 మందిపై కేసు..!

     రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్వహించిన ఓ బర్త్​డే పార్టీ చర్చనీయాంశంగా మారింది. కడ్తాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓఎక్స్​ కంటైనర్​ ఫామ్​హౌస్​లో హైదరాబాద్​కు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి వరుణ్ గౌడ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. భరత్, జీషాన్, అన్వేష్ అనే నిర్వాహకులు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సుమారు 70 మంది యువత పాల్గొన్నారు. లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్దంగా జన్మదిన వేడుకలు నిర్వహించటమే కాకుండా... పెద్దపెద్ద డీజే శబ్ధాల నడుమ... ఫూటుగా మద్యం సేవించి యువత చిందులు వేశారు. 

     సమాచారం అందుకున్న కడ్తాల్​ పోలీసులు శంషాబాద్​ ఎస్వోటీ సిబ్బంది సాయంతో ఫౌమ్​హౌస్​పై దాడి చేశారు. పార్టీ వేడుకలను అడ్డుకున్నారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 20 యువతులు సహా మొత్తం 55 మందిపై కేసులు నమోదు చేశారు. 47 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  డీజేను సీజ్ చేశారు. వరుణ్ గౌడ్ సహా ముగ్గురు పరారీలో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 

Cheating: అనాథనంటూ వల.. మూడో పెళ్లి చేసుకుని 6 లక్షలతో ఉడాయించిందిలా..!

Last Updated : Jun 13, 2021, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.