ETV Bharat / crime

Hit and Run: కారుతో ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితులు అరెస్ట్​ - hyderabad hit and run case

ఈ నెల 23న హైదరాబాద్​లోని షాఅలీ బండ వద్ద జరిగిన హిట్​ అండ్​ రన్​ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కారు నడిపిన ఎండీ ఆదిల్​తో పాటు వాహనంలో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

three accused arrest hit and run case in hyderabad

author img

By

Published : Jun 26, 2021, 4:40 AM IST

హైదరాబాద్​లోని షా అలీ బండ సిగ్నల్​ దగ్గర.. కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడితో పాటు వాహనంలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 23న తలాబ్ కట్టకు చెందిన ఎండీ ఆదిల్... అతడి స్నేహితులు షేక్ అల్తాఫ్, మరో మైనర్ అబ్బాయితో కలిసి కారులో సరదాగా షికార్లు కొడుతున్నారు. పలు ప్రాంతాలకు తిరుగుతూ... దాదాపు సాయంత్రం 7 గంటల సమయంలో షాఅలీ బండ కూడలి వద్ద ఒక ఆటో, 2 ద్విచక్రవాహనాలను, రోడ్డు పక్కనే ఉన్న ఓ మహిళను ఢీకొట్టి పారిపోయారు. ఈక్రమంలోనే హరిబౌలి ప్రాంతంలో మరో వాహనదారుడిని ఢీకొట్టారు.

ఈ ఘటనలో రోడ్డు పక్కన భిక్షాటన చేసుకునే సాలమ్మ... తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై హుస్సేని అలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాహీన్​నగర్ ప్రాంతంలో దాక్కున నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఆసుపత్రిలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.