తనకు సహకరిస్తే.. "చేస్తున్న ఉద్యోగాన్ని స్థాయి పెంచి పోస్టింగ్ ఇప్పిస్తా.. లేకుంటే ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేస్తా".. అని ఓ అంగన్ వాడీ ఆయాను అధికార పార్టీ నేత కుమారుడు బెదిరించిన వైనమిది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఉద్యోగోన్నతి కల్పిస్తానంటూ..
ఏపీ గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని ఓ ప్రజాప్రతినిధి కుమారుడు.. బుధవారం బాధితురాలు పనిచేస్తున్న చోటుకు వచ్చాడు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పదోన్నతి కల్పిస్తానని, తనకు సహకరించాలని ప్రలోభపట్టే ప్రయత్నం చేశాడు. గతంలో ఓ ఉద్యోగిని తొలగించి ఆ స్థానంలో మరో మహిళను నియమించటం వెనుక తన హస్తం ఉందని, అందుకు ప్రతిఫలంగా సదరు మహిళ తనకు సహకరించిందని, అదే విధంగా నీవు కూడా సహకరించాలని, లేకుంటే చేస్తున్న ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని బాధితురాలిని బెదిరించాడు.
అతడి దురుద్దేశాన్ని గుర్తించిన ఆమె అందుకు నిరాకరించారు. తన ఉద్యోగం పోయినా ఫర్వాలేదు అందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు.. "ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత అయినా నీ సంగతి చూస్తా"నంటూ బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలు తమ శాఖ పరిధిలోని.. పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచూడండి: