ETV Bharat / crime

WhatsApp Chatting Threats: కుమార్తె చాటింగ్​ చూపి.. తండ్రిని డబ్బు డిమాండ్​ - threatens to girl's father by WhatsApp chatting

WhatsApp Chatting Threats: 'మీ కుమార్తె ఎవరితోనో చాటింగ్ చేసింది. ఆ చాటింగ్​ సమాచారం నా వద్ద ఉంది. నేను అడిగినంత డబ్బిస్తే ఆ చాటింగ్​ అంతా తొలగించేస్తాను.' అంటూ సదరు అమ్మాయి తండ్రిని డిమాండ్​ చేశాడు ఓ వ్యక్తి. అతని డిమాండ్లకు, బెదిరింపులకు భయపడని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

threats by whats app chat
వాట్సాప్​ చాటింగ్​తో బెదిరింపులు
author img

By

Published : Jan 9, 2022, 2:51 PM IST

WhatsApp Chatting Threats: చరవాణిలో కుమార్తె చాటింగ్‌ వివరాలను చూపి ఓ తండ్రిని డబ్బులు డిమాండ్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ప్రబుద్ధుడిపై హైదరాబాద్​ బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. శ్రీనగర్‌కాలనీలో నివసించే గుత్తేదారు వద్దకు ఈ నెల 1న అయ్యప్ప అనే వ్యక్తి వచ్ఛి. తాను ట్రావెల్స్‌ బస్సు డ్రైవరునని పరిచయం చేసుకున్నాడు. బంజారాహిల్స్‌లోని మీ స్థలం ఓఎన్‌జీసీకి అద్దెకు కావాలని, సదరు సంస్థ అధికారి సైతం వస్తున్నారంటూ నమ్మించాడు. అనంతరం తిరిగి వెళ్లాడు.

అదే రోజు సాయంత్రం తిరిగొచ్చిన అయ్యప్ఫ. ఒక నకిలీ చరవాణి ఛాటింగ్‌ను గుత్తేదారుకు చూపించాడు. ఆయన కుమార్తె గుర్తుతెలియని వ్యక్తితో చాటింగ్‌ చేసిందని పేర్కొంటూ.. దానిని తొలగించడానికి డబ్బులివ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. దీన్ని పట్టించుకోకపోవంతో గుత్తేదారును చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయ్యప్పపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: young man murder in Jagtial : పాతకక్షలతో.. మాటువేసి మట్టుబెట్టారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.