ETV Bharat / crime

రక్తపుధార.. అద్దె అడిగినందుకు దారుణ హత్య - thouse owner murdered asking for rent at west godavari news

తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని కిరాయి అడిగినందుకు యజమాని హత్యకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది.

MURDER
MURDER
author img

By

Published : Mar 2, 2021, 1:21 PM IST

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ముచ్చర్లవారివీధిలో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడన్న కోపంతో యజమాని వంగా ప్రసాద్​ను.. కిరాయికి ఉన్న వ్యక్తి అడపా చినకొండయ్య కిరాతకంగా హతమార్చాడు. తన ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్‌ (50) ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు.

ఈ విషయమై ఇంటి యాజమాని, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదం... 11 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.