భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చర్లరోడ్ ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తలుపు గడియ కట్చేసి ఇంట్లోకి ప్రవేశించి.. బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
బెడ్ రూంలో ఉన్న కబోర్డులను తెరచి వస్తువులన్నింటిని చిందరవందరగా పడేశారు. ఆ కబోర్డుల్లో దాచుకున్న సుమారు మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 30 వేల నగదును దోచుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నాడు.
తెల్లవారుజామున ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఎవరో తలపులు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ స్వామి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : శంషాబాద్లో సుమారు కిలో బంగారం సీజ్