ETV Bharat / crime

మియాపూర్​లో వరుస చోరీలు.. ఇద్దరు అరెస్ట్​ - మియాపూర్‌ ఠాణా మీడియా సమావేశం

మియాపూర్​లో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 35తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు, 20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

Thieves Arrest at miyapur in hyderabad and jewellery recovered
మియాపూర్​లో వరుస చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Jan 30, 2021, 4:49 PM IST

హైదరాబాద్ మియాపూర్​లోని ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి నుంచి 35తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలతోపాటు 20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

సీసీ కెమెరాల ఆధారంగా..

హాఫీజ్‌పేటకు చెందిన మహ్మద్‌ మోయిజ్‌, మహ్మద్ ఇబ్రహీంలు వరుసగా ఆరు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ వివరించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. మియాపూర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో గతేడాది నవంబర్‌ 20 నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు లూటీలు చేశారన్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.

దర్యాప్తులో కృషి చేసి నిందితులను పట్టుకున్న సిబ్బందికి డీసీపీ ప్రోత్సహక బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ కృష్ణప్రసాద్‌, సీఐ వెంకటేశ్వర్లు, డీఐ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.