ETV Bharat / crime

పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్​ బైక్ చోరీ, ఇదిగో వీడియో

author img

By

Published : Aug 22, 2022, 5:56 PM IST

Bike Theft ఈ దొంగ మామూలోడు కాదు. ఎవరి వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకున్నాడు. ఏకంకా పోలీసు స్టేషన్​కి ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న కానిస్టేబుల్ బైక్ నే చోరీ చేశాడు. ఇలా సీసీ కిమేరాలకి చిక్కిపోయాడు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే.

దొంగ దొంగ వచ్చాడే పోలీసు బైక్ తీసుకుపోయాడే

Bike Theft: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉంచిన బైకును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. తాళం బైక్​కు ఉండడాన్ని గమనించిన వ్యక్తి చాకచక్యంగా బైక్​ను ఎత్తుకెళ్లి పోయాడు. పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఓ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కానిస్టేబుల్ బండిని పార్క్ చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే కదా! ఎవరు తీసుకుపోతారు అనుకున్నాడో లేక మర్చిపోయాడో తాళం కూడా దానికే వదిలేశాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగ చక్కగా తన చేతివాటం ప్రదర్శించాడు. చుట్టూ చూసి తర్వాత దర్జాగా బైక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పోలీస్​ స్టేషన్​ ఎదురుగా నిలిపి ఉంచిన బైక్​ చోరీకి గురికావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.