హైదరాబాద్ మిశ్రీ గంజికు చెందిన మహమ్మద్ కమిల్ అలియాస్ అజార్ సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ.. గత కొంతకాలంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్ అన్సారీ ఒవైసీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. అజార్ సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో మే 25న మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రిజ్వాన్ కాలనీలో ఫమీద బేగం ఇంట్లో దొంగతనానికి పాల్పడి అర తుల బంగారం, 2 వెండి ఆభరణాలు, 4 వాచ్‌లు, 4.5 లక్షల నగదు దొంగతనం చేశాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం అజార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో 2సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'