ETV Bharat / crime

పోలీస్ స్టేషన్​లో గంజాయి చోరీ.. ఇంతకీ దొంగ ఎవరంటే? - ganja theft from police station

Theft in Police Station: ఏదైనా పోగొట్టుకుంటే మనం పోలీసు స్టేషన్​కి వెళ్తాం. కానీ పోలీసు స్టేషన్​లో భద్రపరిచినదే పోతే ఎవరి దగ్గరకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీసులకి ఇటువంటి పరిస్థితే ఎదురైంది. సీజ్ చేసి.. భద్రపరచి.. స్టేషన్​లో పెట్టిన గంజాయి మాయమైంది. ఏకంగా 200 కిలోలు మాయం అవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేసి దొంగను కనిపెట్టారు.

kotapahad police station
kotapahad police station
author img

By

Published : Jan 7, 2023, 3:10 PM IST

Theft in Police Station: ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో గంజాయి చోరీ కలకలం రేపింది. సీజ్‌ చేసి భద్రపరిచిన గంజాయిలో కొంత భాగాన్ని కానిస్టేబుల్ మాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ కుమార్‌తో పాటు ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్ కుమార్​ని అరెస్ట్‌ చేయనున్నారు. చోరీ సొత్తు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముగ్గురు మైనర్లు సహకరించినట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.